భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతీయ జనతా పార్టీ (BJP) మల్కాజ్‌గిరి MP ఈటల రాజేందర్‌ను BJP నెల్లికుదురు మండల నాయకుడు తోట రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని నైనాల గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అంశాలు, స్థానిక సమస్యలపై ఈటల రాజేందర్‌తో నాయకులు చర్చించారు.

పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఈటల రాజేందర్‌తో నాయకులు మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని…