భారత్ సమాచార్, డిజిటల్:
మేషం
చిన్ననాటి మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతల కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురవుతాయి. కొత్తగా రుణాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తారు.
వృషభం
ఆకస్మికంగా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
మిధునం
వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.
కర్కాటకం
దైవానుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో అధికారులతో స్వల్ప వివాదాలు ఏర్పడవచ్చు. చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి.
సింహం
ముఖ్యమైన వ్యవహారాల్లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. దాయాదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకును కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. బంధుమిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోవచ్చు.
కన్య
మిత్రుల కలయిక ఆనందాన్ని పెంచుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భూ సంబంధిత క్రయవిక్రయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
తుల
దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం కావడంతో ఊరట లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కొత్త ప్రోత్సాహకాలు లభిస్తాయి. సన్నిహితులతో ఇంట్లో సఖ్యతగా వ్యవహరిస్తారు.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ చివరికి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి.
ధనస్సు
ముఖ్యమైన పనులు అధిక ఖర్చు, శ్రమతోనే పూర్తయ్యే అవకాశం ఉంది. బంధువులతో అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి కారణంగా తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు.
మకరం
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు, వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా అధిగమిస్తారు.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. కొత్త రుణాలు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. బంధువులతో స్వల్ప వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగులకు స్థానచలనం జరిగే సూచనలు ఉన్నాయి.
మీనం
ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది.