భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

తక్కువ ఖర్చుతో ప్రకృతి సాగు.. రైతులకు యాస్మిన్ సూచనలు

ప్రకృతి సాగు బహుబాగు :ఎంఏవో యాస్మిన్ భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా:  ప్రకృతి సాగు మానవుల ఆరోగ్యవంత

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రకృతి సాగు మానవుల ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో మేలు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ తెలిపారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా బుధవారం ఇనుగుర్తి రైతు వేదికలో రైతులకు ఆర్గానిక్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఏవో యాస్మిన్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను అధికంగా వినియోగించడం వల్ల పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. రైతులు తమకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు ఒక ఎకరం చొప్పున ప్రకృతి వనరులను వినియోగించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని సూచించారు.

ప్రకృతి సాగు బహుబాగు :ఎంఏవో యాస్మిన్ భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా:  ప్రకృతి సాగు మానవుల ఆరోగ్యవంత

ప్రకృతి సాగులో భాగంగా జీవామృతం, వివిధ రకాల కషాయాలను స్వయంగా తయారు చేసుకుని సేంద్రీయ పద్ధతిలో పంటలు సాగు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం తక్కువ ఖర్చుతో చేపట్టే అవకాశం ఉండటంతో రైతులకు ఆర్థికంగా కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

అనంతరం స్థానిక రైతు యాకూబ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జీవామృతం, కషాయాల తయారీ విధానంపై రైతులకు శిక్షణతో కూడిన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ భాస్కర్, ప్రాజెక్టు ఇన్‌చార్జి సుష్మతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.