భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రకృతి సాగు మానవుల ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో మేలు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ తెలిపారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా బుధవారం ఇనుగుర్తి రైతు వేదికలో రైతులకు ఆర్గానిక్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఏవో యాస్మిన్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను అధికంగా వినియోగించడం వల్ల పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. రైతులు తమకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో…






