భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

కల్వల స్కూల్స్‌కు బస్ రూట్ కావాలి

బస్సు కోసం నాలుగోసారి వినతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలంలోని TG Model School కల్వల, పరిసర ప్రభుత్వ పాఠశాలలు, సామాన్య ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక బస్ రూట్ మంజూరు చేయాలని కోరుతూ నాలుగోసారి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినట్లు సామాజిక కార్యకర్త చందర్ రెడ్డి తెలిపారు. గురువారం మహబూబాబాద్ డిపో మేనేజర్ కల్యాణికి ఈ లెటర్ అందజేసినట్లు చెప్పారు.

కల్వలలో బస్ సౌకర్యం అందుబాటులోకి వస్తే 200 మందికి పైగా విద్యార్థులు బస్ పాస్‌లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులతో పాటు పరిసర ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, స్థానిక ప్రజలకు కూడా ఈ బస్ రూట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

ఈ అంశంపై ఇప్పటికే RM, ఉన్నతాధికారులతో చర్చించినట్లు చందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం TGSRTC యూనియన్ ఎన్నికలు, దసరా సెలవులు ఉన్నందున వాటి తర్వాత మరోసారి RM, ఉన్నతాధికారులతో చర్చిస్తామని DM కల్యాణి తెలిపినట్లు చెప్పారు.

బస్ రూట్‌కు ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ రద్దు చేయకుండా ఉండేలా పూర్తి స్థాయిలో ప్లాన్ రూపొందించి, అవసరమైన అనుమతులు తీసుకుని రూట్ మంజూరు చేసేందుకు 100 శాతం ప్రయత్నం చేస్తామని DM కల్యాణి హామీ ఇచ్చినట్లు చందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, స్థానిక ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని బస్ రూట్ మంజూరుకు అధికారులు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.