భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని భారీ ర్యాలీ

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని భారీ ర్యాలీ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఓటర్ IDలు, ఓట్లకు సంబంధించిన అంశంపై మహబూబాబాద్ పట్టణంలో మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీగా తరలివెళ్లారు.

ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. ఓటర్ IDలు, ఓట్లకు సంబంధించిన అంశంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌పై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని కోరారు.

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని భారీ ర్యాలీ

నిరసన ర్యాలీ సందర్భంగా మైనారిటీ నాయకులు, పాల్గొన్న ముస్లిం సోదరులు పలు నినాదాలు చేశారు. ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కుకు సంబంధించిన అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నినాదాలతో నిరసన తెలిపారు.

ఈ భారీ నిరసన ర్యాలీలో మైనారిటీ నాయకులు మహమ్మద్ వహీద్, అహ్మద్ ఖాన్ సాహెబ్, మహమ్మద్ ఫరీద్, మౌలానా సయీద్ అహ్మద్, మౌలానా అలంగీర్ సాహెబ్, షేక్ అసిఫ్ అలీ ఫకీర్, మహమ్మద్ ఫజల్ యూసుఫ్ సాహెబ్, అమీర్ జమీల్, అమీర్ అంజద్, షేక్ ఖలీల్ భాయ్‌తో పాటు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.