భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

MLA మైనంపల్లిపై తప్పుడు ప్రచారం.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

MLA మైనంపల్లిపై తప్పుడు ప్రచారం.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ నియోజకవర్గ MLA డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుపై సోషల్ మీడియాలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న MLAపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని తెలిపారు.

MLA ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌తో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న MLAపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సోషల్ మీడియాలో అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలను మెదక్ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.

తప్పుడు ప్రచారాలు చేసే వారిని వదిలిపెట్టకుండా చట్ట ప్రకారం శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పోలీసులను కోరారు. సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించాలని, నిర్ధారణ లేని ఆరోపణలు, అసత్య పోస్టులు ప్రచారం చేయవద్దని సూచించారు.