భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండల పరిధిలోని ప్రగతి ధర్మారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సామర్థ్యం పెంచే పనులు చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు నిజాంపేట విద్యుత్ శాఖ AE గణేష్ కుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన విద్యుత్ అంతరాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని AE తెలిపారు. ప్రగతి ధర్మారం, శివాయిపల్లి, సుతారిపల్లి గ్రామాలతో పాటు ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ సమయంలో సరఫరా ఉండదని చెప్పారు.
ప్రగతి ధర్మారం సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే భవిష్యత్‌లో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని చెప్పారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని AE సూచించారు. పనులు సజావుగా పూర్తయ్యేందుకు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.