భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

భూపట్టాలు ఇవ్వాలని మంత్రి పొంగులేటికి వినతి

భూపట్టాలివ్వాలని మంత్రి పొంగులేటికి వినతి భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: తమ భూములకు పట్టాలు ఇవ్వాల

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ భూములకు రెవెన్యూ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఇనుగుర్తి మండలం మీట్యా తండాకు చెందిన బానోతు రాజేందర్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గురువారం ఖమ్మంలో మంత్రిని కలిసి భూములకు సంబంధించిన సమస్యలను వివరించినట్లు రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మీట్యా తండా పరిధిలో సాగులో ఉన్న ROFR భూములకు సమగ్ర రీసర్వే నిర్వహించి, అర్హులైన గిరిజన రైతులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో కూడిన రెవెన్యూ పట్టాలు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటిని కోరినట్లు తెలిపారు. భూములకు సంబంధించి స్పష్టమైన పట్టాలు లేకపోవడంతో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

మీట్యా తండాకు చెందిన గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ, వాటిపై స్పష్టమైన పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రుణాలు, ఇతర మౌలిక సదుపాయాలకు దూరమవుతున్నారని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు రెవెన్యూ పట్టాలు లేకపోవడం వల్ల రైతులు తమ సాగు భూములకు సంబంధించిన హక్కులను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారని తెలిపారు.

ప్రభుత్వం అర్హులైన గిరిజన రైతులకు రెవెన్యూ పట్టాలు జారీ చేస్తే వారి ఆర్థిక స్వావలంబనకు, పిల్లల భవిష్యత్తుకు, సామాజిక భద్రతకు మరింత భరోసా కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజేందర్ తెలిపారు. భూముల సమస్యను పరిశీలించి, అర్హులైన గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరారు.