భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ భూములకు రెవెన్యూ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఇనుగుర్తి మండలం మీట్యా తండాకు చెందిన బానోతు రాజేందర్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గురువారం ఖమ్మంలో మంత్రిని కలిసి భూములకు సంబంధించిన సమస్యలను వివరించినట్లు రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మీట్యా తండా పరిధిలో సాగులో ఉన్న ROFR భూములకు సమగ్ర రీసర్వే నిర్వహించి, అర్హులైన గిరిజన రైతులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో కూడిన రెవెన్యూ పట్టాలు మంజూరు…






