భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.

తీరొక్క పూలతో బతుకమ్మలు

జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కళాశాలకు హాజరయ్యారు. వివిధ రకాల తీరొక్క పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం కళాశాల ఆవరణలో బతుకమ్మలను ఏర్పాటు చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థుల ఉత్సాహంతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు ఆటలు, పాటలతో సందడి చేయడంతో వేడుకలకు మరింత కళ వచ్చింది. కళాశాల ఆవరణలో విద్యార్థుల సందడి అందరినీ ఆకట్టుకుంది.

అక్కమ్మ చెరువులో నిమజ్జనం

కళాశాలలో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి జిన్నారం అక్కమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.