భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
తీరొక్క పూలతో బతుకమ్మలు
ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కళాశాలకు హాజరయ్యారు. వివిధ రకాల తీరొక్క పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం కళాశాల ఆవరణలో బతుకమ్మలను ఏర్పాటు చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థుల ఉత్సాహంతో…






