భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వై. యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా సంగ శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. TPTF రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ముఖ్యఅతిథిగా హాజరుకాగా, జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.
మండల ఉపాధ్యక్షులుగా బీ. బిక్షపతి, కే. నవీన్, నిక్కత్ న్నిసా బేగం, హరినాథ్ బాబు ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ఎం. మధుసూదన్, కే. సంపత్ రెడ్డి, ఈ. మధుబాబు, ఎస్. ప్రవీణ్ కుమార్‌ను ఎన్నుకున్నారు.
జిల్లా కౌన్సిలర్లుగా కే. వెంకటేశ్వర్లు, కే. బిక్షపతి, కే. పద్మావతి ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బి. శ్రీనివాస్, సభ్యులుగా ఈ. కరుణాకర్, బి. సంపత్ ఎన్నికయ్యారు. అకాడమిక్ సెల్ కన్వీనర్‌గా ఎం.డి. సలీం, సభ్యులుగా శ్రీనివాస చారి, జి. మధును ఎన్నుకున్నారు. జీవోల కమిటీ కన్వీనర్‌గా కే. వెంకటేశం, సభ్యుడిగా పి. రమేష్ ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఎన్నికల అధికారి కె. జనార్ధన్, ఎన్నికల పరిశీలకుడు రవీందర్ రెడ్డి నూతన కమిటీని ప్రకటించారు.
PRC రిపోర్టు వెంటనే అమలు చేయాలి: కవిత
ప్రభుత్వం PRC కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని TPTF రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత డిమాండ్ చేశారు. PRC కమిటీ కాలపరిమితి ముగిసినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి పి. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.