భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వై. యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా సంగ శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. TPTF రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ముఖ్యఅతిథిగా హాజరుకాగా, జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.
మండల ఉపాధ్యక్షులుగా బీ. బిక్షపతి, కే. నవీన్, నిక్కత్ న్నిసా బేగం, హరినాథ్ బాబు ఎన్నికయ్యారు.…






