భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

పండుగ వేళ మహిళలకు సర్‌ప్రైజ్

బిఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి చీరలు వితరణ.. భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ డివిజన్ యూత్ ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్ రెడ్డి తన వీధిలో నిర్వహిస్తున్న బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు చీరలు, కోలలు అందజేశారు.

గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు రూ.15 వేల విలువైన చీరలను మహిళలకు వితరణ చేశారు. బొడ్డెమ్మ చుట్టూ మహిళలు, యువతులు ఆడి పాడేందుకు వీలుగా కోలలను కూడా అందజేశారు. దీంతో వేడుకల్లో పాల్గొన్న మహిళల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బొడ్డెమ్మ

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బొడ్డెమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఈ పండుగను మహిళలు, యువతులు సంప్రదాయబద్ధంగా, మరింత ఉత్సాహంగా నిర్వహించుకునేలా తన వంతుగా చీరలు, కోలలు అందజేసినట్లు చెప్పారు.

బొడ్డెమ్మ వేడుకల్లో తమకు చీరలు, కోలలు అందజేసిన శ్రీనివాస్ రెడ్డికి యువతులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానికంగా బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.