భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

పట్టభద్రుల ఓట్లు BJPకే.. నెల్లికుదురులో నేతల దిశానిర్దేశం

పట్టభద్రులు ఎమ్మెల్సీగా బిజెపికే పట్టం కడతారు.. నెల్లికుదురులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం భార

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు BJP అభ్యర్థికే పట్టం కడతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలో గురువారం BJP మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు హాజరై పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచనపై చర్చించి.. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు.

మోదీ పాలనతో దేశ అభివృద్ధి

ఈ సందర్భంగా వల్లబు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాలతో యువత BJP వైపు చూస్తోందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని BJP మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ సూచించారు. పట్టభద్రులైన ఓటర్లు మేధావులని, దేశ భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఆలోచించే వారు కావడంతో BJPకి మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP విజయానికి ప్రతి కార్యకర్త పట్టభద్రుల ఓటర్లను కలుస్తూ పార్టీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని నాయకులు సూచించారు.

హాజరైన నాయకులు

కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ సింగారపు సతీష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాపారావు, ప్రభాకర్ రెడ్డి, తోట రేణుక, జి. సురేష్, నెల్లికుదురు మండల ఎమ్మెల్సీ కన్వీనర్ రాస యాకిరెడ్డి, బాదావత్ సురేష్, జాటోత్ విజేందర్, ఎండి ముస్తఫా, సలుగు ప్రవీణ్, డేగల నవీన్, తోట రమేష్, దుస్స యాకయ్య, గుంశవాళి, లింగన్న, యాకన్న, నరసయ్య, జలక యాకన్న, తోట సురేష్, గుగులోత్ సోమన్న, ఏర్పుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.