భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు BJP అభ్యర్థికే పట్టం కడతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలో గురువారం BJP మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు హాజరై పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ…






