భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యలపై MLA సునీత లక్ష్మారెడ్డి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం విద్యుత్ శాఖ ఎస్‌ఈ అధికారితో మాట్లాడి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ రోజుకు కేవలం 6 నుంచి 7 గంటలే సరఫరా అవుతుండటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైతుల పంటలను కాపాడేందుకు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని MLA సునీత లక్ష్మారెడ్డి కోరారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని, నర్సాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.