భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యలపై MLA సునీత లక్ష్మారెడ్డి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం విద్యుత్ శాఖ ఎస్‌ఈ అధికారితో మాట్లాడి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.

వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ రోజుకు కేవలం 6 నుంచి 7 గంటలే సరఫరా అవుతుండటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…