భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

కరెంట్ ఇవ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి

కరెంట్ ఇవ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయానికి 12 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

పంట చేతికొచ్చే సమయంలోనే నష్టం..

కరెంట్ ఇవ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి

రైతులు వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలను సాగు చేస్తున్నారని, పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలి

కరెంట్ ఇవ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం: పద్మా దేవేందర్ రెడ్డి

విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వ్యవసాయానికి రోజుకు 12 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ MLA పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సుప్రభాత రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.