భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సర్గూ శ్రీనివాస్ విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బాధిత కుటుంబానికి అండగా పద్మా దేవేందర్‌రెడ్డి
రైతు శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్న మాజీ ఉపసభాపతి, మాజీ MLA ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయం అందజేశారు.
కుటుంబ సభ్యులకు నాయకుల పరామర్శ
రైతు మృతితో బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు నాయకులు తమ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నాయకులు చౌదరి సుప్రభాతరావు, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ సాగర్, చిట్టిమళ్లి నరేందర్‌రెడ్డి, శ్రావణ్‌గౌడ్, హస్నుద్దీన్, వంశీ సాగర్, బబ్లు శ్రీకాంత్, రాజు సాగర్, సంపత్, దోమకొండ శ్రీనివాస్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.