భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో విద్యుత్ సెగ.. జాతీయ రహదారిపై బైఠాయింపు

విద్యుత్ కొలతలను నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి సబ్ స్టేషన్ వద్ద రైతుల పెద్ద ఎత్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి సబ్‌స్టేషన్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పంటలు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

765 డి జాతీయ రహదారిపై రైతుల నిరసన

విద్యుత్ కోతలతో పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, తమ పంటలను రక్షించాలంటూ 765 డి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్ కొలతలను నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి సబ్ స్టేషన్ వద్ద రైతుల పెద్ద ఎత్

రహదారిపై స్తంభించిన వాహనాల రాకపోకలు

రైతులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో 765 డి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల ఆందోళనతో రెడ్డిపల్లి సబ్‌స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని డిమాండ్

ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవసరమైన మేరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.