భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి సబ్‌స్టేషన్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పంటలు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
765 డి జాతీయ రహదారిపై రైతుల నిరసన
విద్యుత్ కోతలతో పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన…






