భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఆర్టీసీ ఎన్నికల్లో TWU ఘనవిజయం.. నర్సాపూర్‌లో భారీ మెజారిటీ

ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) ఘనవిజయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) ఘనవిజయం సాధించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోలో జరిగిన డిపో కార్యదర్శి ఎన్నికల్లో యూనియన్‌కు భారీ మద్దతు లభించింది. మొత్తం 108 ఓట్లకు గాను TWUకు 100 ఓట్లు రావడంతో భారీ మెజారిటీతో విజయం సాధించింది.

రాష్ట్రస్థాయి ఎన్నికల్లోనూ సత్తా

రాష్ట్రస్థాయి ఎన్నికల్లోనూ TWUకు కార్మికుల నుంచి విశేష మద్దతు లభించింది. మొత్తం 108 ఓట్లకు గాను 105 ఓట్లు యూనియన్‌కు వచ్చినట్లు పోలింగ్ అధికారులు ప్రకటించారు. వరుస విజయాలతో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది.

ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) ఘనవిజయం

వెంకట్ గౌడ్‌కు ఘన సన్మానం

ఈ సందర్భంగా నర్సాపూర్ డిపో TWU అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి, యూనియన్ ప్రతినిధులతో పాటు డిపో కార్యదర్శిగా ఎన్నికైన వెంకట్ గౌడ్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి యూనియన్ నాయకులు నిరంతరం కృషి చేయాలని కోరారు.

ఈ విజయం కార్మికులు యూనియన్‌పై ఉంచిన నమ్మకానికి, వారి ఐక్యతకు నిదర్శనమని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తామని పేర్కొన్నారు.