భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

లక్ష్మీపురంలో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు

లక్ష్మీపురంలో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో బొడ్డెమ్మ సంబరాలను మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ వేడుకల్లో గ్రామానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తీరొక్క పూలతో బొడ్డెమ్మను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

సంప్రదాయ చీరల్లో మహిళల సందడి

బొడ్డెమ్మ వేడుకల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం మహిళలు సంప్రదాయ ఏకరూప చీరలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బొడ్డెమ్మ చుట్టూ చేరి సంప్రదాయ బొడ్డెమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడి పాడారు. మహిళల ఆటపాటలు, సందడితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు బొడ్డెమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

మహిళలతో కలిసి ఆడిపాడిన సర్పంచి

ఈ సంబరాల్లో లక్ష్మీపురం గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి పాల్గొన్నారు. గ్రామ మహిళలతో కలిసి బొడ్డెమ్మ పాటలకు ఆడిపాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి పండుగలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, స్థానిక ఆచారాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో స్రవంతి, జమున, ఉమా, స్వప్న, కమలమ్మ, నిర్మల, లక్ష్మి, ధనమ్మ, శోభ, శేషమ్మ, బాణాల లక్ష్మి, ముతేశ్వరి, సమ్మక్క, అమ్ములు, దివ్యశ్రీ, నవ్యశ్రీ, సరస్వతి, నీరజ తదితరులు పాల్గొన్నారు.