భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో బొడ్డెమ్మ సంబరాలను మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ వేడుకల్లో గ్రామానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తీరొక్క పూలతో బొడ్డెమ్మను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
సంప్రదాయ చీరల్లో మహిళల సందడి
బొడ్డెమ్మ వేడుకల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం మహిళలు సంప్రదాయ ఏకరూప చీరలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బొడ్డెమ్మ చుట్టూ చేరి…






