భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధి చిక్కడపల్లిలో ఉన్న ఎస్టీ ఆడమ్స్ స్కూల్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.

స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారు. క్లాస్ టీచర్ పుష్పలత, కీర్తి టీచర్లతో కలిసి విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ ప్రత్యేకతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను పాఠశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థినులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు విప్రియా ఇండియా, హసినీ, ఆద్య, ఆర్య తదితరులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.