భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధి చిక్కడపల్లిలో ఉన్న ఎస్టీ ఆడమ్స్ స్కూల్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారు. క్లాస్ టీచర్ పుష్పలత, కీర్తి టీచర్లతో కలిసి విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ చేరి…






