భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మెదక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

మెదక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ MLA పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ MLA సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మెదక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

కాగడాలతో పట్టణంలో ప్రదర్శన

మెదక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

జిల్లా ఆవిర్భావాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ప్రదర్శనలో బీఆర్ఎస్ శ్రేణులు కాగడాలతో పట్టణంలో సందడి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఏర్పాటు ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పరిపాలనా సౌకర్యాలు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు.

మెదక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

మెదక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

ఈ కార్యక్రమంలో రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ బాజే చంద్రం, కౌన్సిల్ సభ్యులు మాజీ ఎస్కే హైమద్, ఉమా మహేశ్వర్, హస్నుద్దీన్, కన్నపురం కృష్ణ గౌడ్, శ్రీనివాస్, శ్రీకాంత్ సాగర్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.