భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెడ్‌క్రాస్ సొసైటీకి విశేష సేవలు అందించిన డీఎల్‌ఎన్ చారిని అఖిల భారత విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా సభ్యులు ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షురాలు మడుపు స్వప్న మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీకి డీఎల్‌ఎన్ చారి అందించిన సేవలు అమోఘమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనను సత్కరించడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, అడ్వకేట్, కోశాధికారి టీ. లత, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. కవిత, ఉపాధ్యక్షురాళ్లు వీ. కృష్ణవేణి, బీ. లత, ముఖ్య సలహాదారు కే. గీత, కార్యదర్శులు వీ. లక్ష్మి, విజయ, చైర్మన్ పోతనకల్ లక్ష్మీనారాయణ, కెంపుల నాగరాజు, సీహెచ్ రేవంత్‌తో పాటు విశ్వబ్రాహ్మణ సోదరీమణులు, సోదరులు తదితరులు పాల్గొన్నారు.