భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

పెద్దమందడిలో తాగునీటి సమస్యకు పరిష్కారం..

WhatsApp Image 2025-09-14 at 5.42.38 PM

భారత్ సమాచార్.నెట్, వనపర్తి జిల్లా : పెద్దమందడి మండలం బలిదుపల్లి గ్రామ ప్రజలు రెండు నెలలుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. గ్రామంలోని ఫిల్టర్ నీటి కేంద్రం వద్ద మోటారు పాడైపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

 

సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన చొరవతో మోటారును తక్షణమే బాగు చేయించారు. దీంతో మళ్లీ తాగునీరు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల కష్టాలు తీరాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మేగా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

మరిన్ని కథనాలు :

 

విరాట్ విశ్వకర్మ యజ్ఞానికి మాజీ మంత్రికి ఆహ్వానం