భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

పోతనకల్ లక్ష్మీనారాయణకు ఘన సన్మానం

పోతనకల్ లక్ష్మీనారాయణకు ఘన సన్మానం

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన పోతనకల్ లక్ష్మీనారాయణతో పాటు కెంపుల నాగరాజును అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ సభ్యులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు పాల్గొని వారిని అభినందించారు.

ఈ సందర్భంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అధ్యక్షురాలు మడుపు స్వప్న మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీకి పోతనకల్ లక్ష్మీనారాయణ అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ, అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయమని ఈ సందర్భంగా సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు గంగా మోహన్, గౌరవ అధ్యక్షురాలు అడ్వకేట్ జి. ఝాన్సీ రాణి, కోశాధికారి టి. లత, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. కవిత, ఉపాధ్యక్షురాళ్లు వి. కృష్ణవేణి, బి. లత, ముఖ్య సలహాదారు కే. గీత, కార్యదర్శులు వి. లక్ష్మి, విజయ, సీహెచ్. రేవంత్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.