భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన పోతనకల్ లక్ష్మీనారాయణతో పాటు కెంపుల నాగరాజును అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ సభ్యులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు పాల్గొని వారిని అభినందించారు.

ఈ సందర్భంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అధ్యక్షురాలు మడుపు స్వప్న మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీకి పోతనకల్ లక్ష్మీనారాయణ అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ, అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ…