భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఎల్ నినోపై సీఎం వీడియో కాన్ఫరెన్స్.. రైతులు తప్పక వీక్షించాలి

ఎల్ నినోపై సీఎం వీడియో కాన్ఫరెన్స్.. రైతులు తప్పక వీక్షించాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి (MAO) భూక్య మహేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మూడు రైతు వేదికల్లో ప్రసారం

నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు ఆలేరు, మునిగలవీడు గ్రామాల్లోని రైతు వేదికల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు MAO మహేందర్ వెల్లడించారు. ఆయా రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరై ఎల్ నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులు, వ్యవసాయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభం

సోమవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుందని మహేందర్ తెలిపారు. నెల్లికుదురు, ఆలేరు, మునిగలవీడు రైతు వేదికల పరిధిలోని కర్షకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు. కాన్ఫరెన్స్‌లో అందించే సూచనలను తెలుసుకొని, వాటికి అనుగుణంగా వ్యవసాయంలో ముందుకు సాగాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MAO భూక్య మహేందర్ విజ్ఞప్తి చేశారు.