భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి (MAO) భూక్య మహేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మూడు రైతు వేదికల్లో ప్రసారం
నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు ఆలేరు, మునిగలవీడు గ్రామాల్లోని రైతు వేదికల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు MAO మహేందర్ వెల్లడించారు. ఆయా రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ…






