భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఎల్ నినోపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

ఎల్ నినోపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం (12న) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రెండు రైతు వేదికల్లో ప్రసారం

మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు చిన్న ముప్పారం గ్రామంలోని రైతు వేదికల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావిత పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు అందించనున్నారు.

రైతులు తప్పక వీక్షించాలి

ఇనుగుర్తి, చిన్న ముప్పారం రైతు వేదికల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. సోమవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అందించే సూచనలను తెలుసుకొని, వాటికి అనుగుణంగా వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ విజ్ఞప్తి చేశారు.