భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం (12న) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు రైతు వేదికల్లో ప్రసారం
మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు చిన్న ముప్పారం గ్రామంలోని రైతు వేదికల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావిత పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించడంతో…






