భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఇనుగుర్తిలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం అమ్మవారి విగ్రహాలను అందంగా అలంకరించి, వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గామాత నామస్మరణ, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఇనుగుర్తిలో ఘనంగా వేడుకలు

ఇనుగుర్తిలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఇనుగుర్తి మండల కేంద్రంలోని చారిత్రక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో, పెద్ద వినాయకుని మండపం వద్ద దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. వద్దిరాజు కిషన్, MP రవిచంద్ర సోదరుల సౌజన్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ఆలయ అర్చకులు తిరునహరి కృష్ణమాచార్యుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వద్దిరాజు సోదరుల్లో ఒకరైన వెంకన్న, ఉమామహేశ్వరి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో SI పి. నరేష్, వద్దిరాజు వెంకన్న (ఎక్సైజ్), పద్మ, వద్దిరాజు వెంకన్న–రజిత దంపతులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఇనుగుర్తిలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు దుర్గామాత బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సుందరంగా అలంకరించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. దుర్గామాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

మండలంలోని వివిధ గ్రామాల్లోనూ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో ఉత్సవాలు కొనసాగనున్నాయి.