భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం అమ్మవారి విగ్రహాలను అందంగా అలంకరించి, వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గామాత నామస్మరణ, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఇనుగుర్తిలో ఘనంగా వేడుకలు

ఇనుగుర్తి మండల కేంద్రంలోని చారిత్రక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో, పెద్ద వినాయకుని మండపం వద్ద దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను…