భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: వలిగొండ–తొర్రూరు హైవేపై పల్లెర్ల స్టేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధరావత్ చందర్‌ (42) మృతి చెందాడు. తన సోదరుడు చందుతో కలిసి బైక్‌పై కూలీ పనుల కోసం జంగారెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గెదేను ఢీకొట్టడంతో ప్రమాదం

చందర్‌ తన సోదరుడు చందుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, పల్లెర్ల స్టేజీ సమీపంలో రోడ్డుపైకి వచ్చిన గెదేను బైక్‌ ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న చందర్‌ బైక్‌పై నుంచి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల తీవ్రతతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న చందుకు కూడా గాయాలయ్యాయి.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

గాయపడిన చందును వలిగొండలోని రేణుకాదేవి ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో చందర్‌ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి భార్య యాకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.