భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కుమార్

ఇనుగుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కుమార్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు మండల సర్పంచుల ఫోరాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక వద్దిరాజు వెంకటనారాయణ మెమోరియల్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ తెలిపారు.

అధ్యక్షుడిగా కుమార్.. ప్రధాన కార్యదర్శిగా బద్రు నాయక్

ఇనుగుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్‌ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా, తారా సింగ్ తండ సర్పంచ్ నూనావతు బద్రు నాయక్‌ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇనుగుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కుమార్

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కుమార్, బద్రు నాయక్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించిన వివిధ గ్రామాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మండలంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

మండలంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి, సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఫోరం వేదికగా పనిచేస్తామని నూతన బాధ్యులు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సర్పంచుల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు ఇస్లావత్ నరేష్, ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి, చెడుపాక సుజాత, యాకయ్య, బానోతు రేణుక, నరేష్, భూక్య వెంకన్న, చిన్ని, మీటు నాయక్, భూక్య లక్ష్మి, వెంకన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, గంజి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.