భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు మండల సర్పంచుల ఫోరాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక వద్దిరాజు వెంకటనారాయణ మెమోరియల్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ తెలిపారు.
అధ్యక్షుడిగా కుమార్.. ప్రధాన కార్యదర్శిగా బద్రు నాయక్
ఇనుగుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్‌ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా, తారా సింగ్ తండ సర్పంచ్ నూనావతు బద్రు నాయక్‌ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
…






