భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: రవికుమార్

దసరా శరన్నవరాత్రి వేడుకలు: అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ డెలి

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భువనగిరి పట్టణంలో భక్తి సందడి నెలకొంది. నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారిని TPCC డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రుల వంటి పర్వదినాల్లో భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్న నేతాజీ యూత్ సభ్యులను ఆయన అభినందించారు.

పండుగల సమయంలో భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందుతాయని నాయకులు పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కల ఆదినారాయణ, హీరేకార్ శ్రీను, బోయిని బాలయ్యతో పాటు నేతాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.