భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భువనగిరి పట్టణంలో భక్తి సందడి నెలకొంది. నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారిని TPCC డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రుల వంటి పర్వదినాల్లో భక్తుల…






