భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

వరి ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా సక్రమంగా నిర్వహించాలి

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా సక్రమంగా నిర్వహించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు. రైతులకు సకాలంలో సేవలు అందిస్తూ ధాన్యం సేకరణను సజావుగా పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

మద్దతు ధరపై గోడప్రతుల ఆవిష్కరణ

వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వివరాలను రైతులకు తెలియజేసేందుకు రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రైతులకు మద్దతు ధరపై అవగాహన కల్పించడంతో పాటు, కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, DRDO విజయలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.