భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో కల్పించాల్సిన…





