భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలోని హనుమాన్ ఆలయం ఎదుట దాతల సహకారంతో రూ.2 లక్షల వ్యయంతో నిర్మించనున్న సభా మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి దాతలు, గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తి కార్యక్రమాలకు ఉపయోగకరం
హనుమాన్ ఆలయం వద్ద దైవ సంబంధిత కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు సభా మండపం నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ ముదిరెడ్డి కళావతి ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ మండపం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆలయాల వద్ద అవసరమైన సదుపాయాల కల్పనలో దాతలు భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు.
భూమి పూజలో పాల్గొన్న దాతలు, గ్రామస్తులు
సభా మండప నిర్మాణానికి దాతలుగా దొంగరి చంద్రమౌళి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కర్ణకంటి రాజేందర్ రెడ్డి, కర్ణకంటి రామ్మోహన్ రెడ్డి, కర్ణగంటి భాస్కర్ రెడ్డి, కర్ణకంటి సుదర్శన్ రెడ్డి, ముత్యాల యాకన్న, లాకావత్ బద్రు, లకావత్ వెంకన్న, కాల్సాని వెంకట్ రెడ్డి, గాడిపెల్లి పెద్దయ్య కన్న తదితరులు సహకరించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రు నాయక్తో పాటు వెంకన్న, కృష్ణారెడ్డి, బాణాల చిన్న వెంకన్న, గాడిపెల్లి రఘు, ముత్యాల సంపత్, ప్రతాపరెడ్డి, లాకా శ్రీను, చంద్రయ్య, గోపాల్ రెడ్డి, పత్తిపాక వెంకట్ నారాయణ చారి, ముత్యాల చిన్న వెంకన్న, పెద్ద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.