భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలోని హనుమాన్ ఆలయం ఎదుట దాతల సహకారంతో రూ.2 లక్షల వ్యయంతో నిర్మించనున్న సభా మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి దాతలు, గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భక్తి కార్యక్రమాలకు ఉపయోగకరం

హనుమాన్ ఆలయం వద్ద దైవ సంబంధిత కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు సభా మండపం నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ ముదిరెడ్డి కళావతి ఈ సందర్భంగా తెలిపారు.…