భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో SIR ప్రక్రియ, ATC పనులపై RDO తనిఖీ

ఇనుగుర్తిలో SIR ప్రక్రియ, ATC పనులపై RDO తనిఖీ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియతో పాటు, ATC నిర్మాణ స్థలంలో చేపట్టిన చదును పనులను RDO రాజేశ్వరి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ సుంకరి శ్రీనివాస్‌తో కలిసి సంబంధిత పనుల పురోగతిని సమీక్షించారు.

SIR ప్రక్రియపై పరిశీలన

ఇనుగుర్తిలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, సంబంధిత పనుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు.

ATC పనులు వేగంగా పూర్తి చేయాలి

ATC నిర్మాణం చేపట్టనున్న స్థలంలో జరుగుతున్న చదును పనులను పరిశీలించిన RDO రాజేశ్వరి, పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్మాణానికి సంబంధించిన పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుని, నిర్ణీత సమయంలో వేగంగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ బషీర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.