భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియతో పాటు, ATC నిర్మాణ స్థలంలో చేపట్టిన చదును పనులను RDO రాజేశ్వరి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ సుంకరి శ్రీనివాస్‌తో కలిసి సంబంధిత పనుల పురోగతిని సమీక్షించారు.

SIR ప్రక్రియపై పరిశీలన

ఇనుగుర్తిలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, సంబంధిత పనుల్లో…